పవన్ సినిమాకు కీరవాణి సంగీతం!!
on Dec 26, 2019

రాజకీయాల నుండి సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రావడం ఖాయమే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో హీరోగా కాకుండా... 'పింక్'లో కీ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాయర్ క్యారెక్టర్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ప్రజెంట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్యూన్స్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.
'పింక్' రీమేక్ పవన్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడనే విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. ఆయన దగ్గర కొందరి నిర్మాతల అడ్వాన్సులు ఉన్నాయి. దర్శకులతో ఆయా నిర్మాతలు పవన్ దగ్గరకు వెళుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ ను వెంటబెట్టుకుని నిర్మాత ఏఎం రత్నం చాలాసార్లు వెళ్లారు. 'పింక్' రీమేక్ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని ఫిలింనగర్ టాక్. జానపద నేపథ్యంలో పవన్ కు సూటయ్యే విధంగా క్రిష్ కథ సిద్ధం చేశాడట. దీనికి కీరవాణి సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే... పవన్, కీరవాణి కాంబినేషన్లో ఇదే తొలి సినిమా అవుతుంది. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ సినిమాలకు కీరవాణి సంగీతం అందించలేదు. క్రిష్ తో ఎన్టీఆర్ బయోపిక్, వేదం సినిమాలకు పని చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



