సుడి ఉండబట్టే 'సాఫ్ట్‌వేర్ సుధీర్'ని అయ్యాను!
on Dec 26, 2019

సుడిగాలి సుధీర్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శేఖర్‌రాజు నిర్మిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా డిసెంబర్ 28న విడుదలవుతోంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ మాట్లాడుతూ తనకు సుడివుండబట్టే మంచి క్యాస్టింగ్‌తో ఈ సినిమా చేశానన్నారు.
"కొన్నేళ్ల క్రితం నార్మల్ సుధీర్‌గా ఉన్న నన్ను మా శీనుగాడు 'జబర్దస్త్'లో వేణు టీంలో పెట్టించి జనాలకు సుధీర్ అంటే తెలిసేట్లు చేశాడు. అందుకు శీనుకూ, వేణన్నకూ థాంక్స్. ఆ సుధీర్‌ని మల్లెమాల సంస్థ 'సుడిగాలి సుధీర్'గా మార్చింది. ఆ సంస్థకు జీవితాంతం రుణపడివుంటాను. ఆ సుడిగాలి సుధీర్‌ను అభిమానుల ప్రేమవల్ల ఈ సినిమా దర్శక నిర్మాతలు 'సాఫ్ట్‌వేర్ సుధీర్'గా మార్చారు. మా జనరేషన్ అందరికీ ఈ ఫీల్డులోకి రావడానికి చిరంజీవి గారు, పవన్ కల్యాణ్ గారు ఇన్‌స్పిరేషన్. ఈ ఈవెంట్‌కు కర్ణాటక నుంచి కూడా అభిమానులు వచ్చారంట. వాళ్లందరికీ థాంక్స్. హీరోగా నా ఫస్ట్ సినిమానే ఇంత మంచి క్యాస్టింగ్‌తో ఇచ్చినందుకు హ్యాపీ. అది సుడి ఉండబట్టే అయ్యిందేమో. గద్దర్, పోసాని, ఇంద్రజ, నాజర్, సాయాజీ షిండే వంటి పెద్దవాళ్లు ఈ సినిమాలో నటించారు. వొంట్లో బాగోలేకపోవడం వల్ల హీరోయిన్ ధన్య బాలకృష్ణ ఈ ఈవెంట్‌కు రాలేకపోయారు. రష్మీ కూడా రావాల్సింది కానీ తను బిజీగా ఉండటం వల్ల రాలేదు. నేనెక్కడికి వెళ్లినా నీ వెంటే ఉంటామని నా జబర్దస్త్ ఫ్యామిలీ కూడా ఇక్కడకు వచ్చింది. ఎదురుగా మా డాడీ ఉండటం వల్ల మాట్లాడ్డానికి టెన్షన్ పడుతున్నా. 28వ తారీఖు సినిమా రిలీజవుతోంది. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి. మీ వల్లే సినిమా నిలబడుద్ది. బాగాలేకపోతే నాకు చెప్పండి. తర్వాత ఇంతకంటే అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తా. వెనక్కి తగ్గేదే లేదు. నేనివాళ్ల ఇక్కడ ఉన్నానంటే కారణం అభిమానులే. వాళ్లకు జీవితాంతం రుణపడిపోయుంటా" అని చెప్పారు సుధీర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



