మ్యారేజ్ డే సందర్భంగా ట్విట్టర్ లో మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్!
on Feb 10, 2023

తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కామ్ అండ్ డీసెంట్ హీరోగా గుర్తింపు ఉంది. అయితే మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ ల పెళ్ళి రోజు నేడు. వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకొని నేటికి పద్దెనిమిదేళ్ళు అవ్వడంతో మహేశ్ బాబు తన ట్విట్టర్ లో ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు.
సోషల్ మీడియాలో ప్రతీది అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే మహేశ్.. తన భార్య నమ్రతా శిరోద్కర్ తో ఉన్నప్పటి పెళ్ళైన తొలినాటి ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. "18 ఏళ్ళ ప్రయాణం.. ఎప్పటికీ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి. పెళ్ళి రోజు శుభాకాంక్షలు నమ్రతా శిరోద్కర్" అని రాసుకొచ్చాడు. నమ్రతా శిరోద్కర్ కూడా తన విషెస్ ని తెలిపింది. "మా జీవితంలో మేం తీసుకున్న మంచి నిర్ణయం. పద్దెనిమిదవ పెళ్ళి రోజు జరుపుకుంటున్నాం. పెళ్ళి రోజు శుభాకాంక్షలు మహేశ్ బాబు " అంటూ తను మహేశ్ ని కిస్ చేస్తోన్న ఫోటోని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అయితే వీరి పెళ్ళి రోజు సందర్భంగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రిటీలు సైతం తమ శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల కూతురు సితార కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో.. " I love you both just like you each other.. Happy anniversary Amma nanna " అని పోస్ట్ చేసి తన విషెస్ ని తెలిపింది. కాగా మహేశ్ బాబు తన SSMB28 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



