నాలుగు నెలలు... అజిత్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారా?
on Feb 10, 2023

ప్లానింగ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? సినిమాను అనౌన్స్ చేసేటప్పుడే రిలీజ్ డేట్‌కి కూడా ముహూర్తం పెట్టేయాలి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న విషయం కూడా ఇదే. సో ఈ ట్రెండ్‌నే ఫాలో అవ్వమని తన డైరక్టర్స్ కి చెప్పేస్తున్నారు అజిత్ కుమార్. ఏకే 62కి సంబంధించి అజిత్ పెడుతున్న కండిషన్లు మేకర్స్ కి విచిత్రంగా అనిపిస్తున్నాయట. మామూలుగా డైరక్టర్ ఏం చెబితే అది చేసుకుని వెళ్లిపోతారని, క్రియేటివిటీ విషయాల్లో వేలు పెట్టరనే పేరుంది అజిత్ కుమార్‌కి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన గురించి రకరకాల ఒపీనియన్స్ షేర్ అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాను విడుదల చేశారు అజిత్. కాస్త గ్యాప్ తర్వాత ఏకే 62ని విఘ్నేష్ శివన్ డైరక్ట్ చేస్తారని అనుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా విఘ్నేష్ ఆ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నారు.
ఆ స్థానంలోకి మగిళ్ తిరుమేని అనే డైరక్టర్ ఎంట్రీ ఇచ్చారు. అయితే మగిళ్ తిరుమేని చెప్పిన కథలో యాక్షన్ పార్ట్ పెద్దగా లేదట. మరికొన్ని కరెక్షన్లు కూడా ఉన్నాయట. ఈ విషయాన్నే అతనికి చెప్పారట అజిత్. యాక్షన్ పార్టుని పెంచి, కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ ని సెట్ చేయమని అన్నారట. సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తున్నాం, ఎప్పుడు పూర్తి చేస్తాం అనే విషయం మీద కూడా క్లారిటీ కావాలని అడిగారట. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు నెలల్లో ప్రొడక్షన్ పూర్తి చేయాలని, అందుకు తగ్గట్టే తన కాల్షీట్‌ని అలాట్ చేస్తానని అన్నారట అజిత్. ప్రస్తుతం మగిళ్ తిరుమేని ఆ పనుల్లోనే ఉన్నారు. రీసెంట్‌గా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు అజిత్. మగిళ్ తిరుమేనికి మార్చి నుంచి సాలిడ్ కాల్షీట్ ఇవ్వాలని కూడా ఫిక్స్ అయ్యారట. దీన్ని బట్టి అక్టోబర్‌కి అజిత్ సినిమా కూడా రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయంటున్నారు కోలీవుడ్ క్రిటిక్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



