కార్తికి అను ఇమ్మాన్యుయేల్ ఏం నేర్పిస్తున్నారో తెలుసా?
on Feb 10, 2023

చంటిగాడు లోకల్ అనే మాట చాలా సార్లు వినే ఉంటారు. కానీ పాప లోకల్ అనే మాట విన్నారా? ఇప్పుడు మనతో పాటు కార్తి కూడా ఈ మాటను పదే పదే వింటున్నారు. అతనితో ఆ మాట అంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా... అను ఇమ్మాన్యుయేల్.
కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా జపాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళ కోళికోడ్‌లో జరుగుతోంది.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అటూ ఇటూ వెళ్తున్నప్పుడు కార్తికి మలయాళం పదాలను ఎలా వాడాలో నేర్పిస్తున్నారట అను ఇమ్మాన్యుయేల్. అను ఇమ్మాన్యుయేల్ తండ్రి మలయాళ ప్రొడ్యూసర్. అనుది మలయాళ ఫ్యామిలీ. ఇంట్లో వాళ్లు మలయాళంలోనే మాట్లాడుకుంటారు.ప్రస్తుతం కోళికోడ్‌లో జరుగుతున్న జపాన్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందట. ఈ షెడ్యూల్‌తో గుమ్మడికాయ కొట్టేస్తారట మేకర్స్.లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో హ్యాపీగా ఉన్నారు కార్తి. ఆయన నటించిన సర్దార్ సినిమా పెద్ద హిట్ అయింది. పొన్నియిన్ సెల్వన్‌లోనూ కార్తి నటించిన వందియదేవర్ వల్లవరాయన్ కేరక్టర్‌కు బెస్ట్ అప్లాజ్ దక్కింది.
సో ఇప్పుడు అదే స్పీడుతో జపాన్‌ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు పొన్నియిన్ సెల్వన్2 కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.అను ఇమ్మాన్యుయేల్ కూడా పాజిటివ్ టర్మ్స్ లోనే ఉన్నారు. అల్లు శిరీష్‌తో ఆమె నటించిన ఉర్వశివో రాక్షసివో సినిమాకు లాస్ట్ ఇయర్ బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి.సో ఆల్రెడీ హిట్ మీదున్న కార్తి అండ్ అను, ఈ ఏడాది జపాన్ మూవీతో హిట్ స్ట్రీక్‌ని కంటిన్యూ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



