మహేష్ బాబుతో క్రేజీ గా అల్లరి నరేష్
on Apr 8, 2017
మహేష్ బాబు ఇంత వరకు ఒకే ఒక్క మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో నటించాడు. పలువురు దర్శకులు తర్వాత మహేష్ ని మల్టీస్టారర్ కథలతో మెప్పించే ప్రయత్నం చేసినా అవి సఫలీకృతం అవ్వలేదు. ఈసారి అలాంటి సినిమా చేస్తే, కథ మాములుగా ఉండకూడదు అనేది మహేష్ ఒపీనియన్. అదీ కాకుండా, తన పాత్రకి అధిక ప్రాధాన్యం ఉండాలి అనేది మహేష్ అభిప్రాయం అయ్యుండొచ్చు.
అయితే, మహేష్ తన సినిమాలో ఇంకో హీరోకి స్పేస్ ఇచ్చే విషయంలో అంగీకారం తెలిపాడని తెలిసింది. మురుగదాస్ తో సినిమా తర్వాత మహేష్ కొరటాల శివ తో భరత్ అను నేను అనే సినిమా చేయనున్నాడు. దాని తర్వాత, వంశి పైడిపల్లి తో జత కట్టనున్నాడు. ఈ చిత్రం కోసం ఒక ప్రధాన పాత్రకు అల్లరి నరేష్ అయితే బాగుంటుందని వంశీ అనుకున్నాడట. లక్కీ గా మహేష్ కూడా దీనికి ఒకే చెప్పాడట. నరేష్ ని ఈ విషయమై సంప్రదిస్తే తాను కూడా సంతోషంగా ఒప్పుకున్నాడట. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలు అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. మహేష్, అల్లరి నరేష్ కాంబినేషన్, ఇది వింటుంటేనే క్రేజీ గా ఉంది కదూ!
Also Read