మణిరత్నం గురించి సుహాసిని చెప్పింది అక్షరాలా కరెక్ట్
on Apr 8, 2017

మణిరత్నం కి అభిమానుల సంఖ్య ఎక్కువే. ఈ మధ్య ఎన్ని ప్లాపులు తీసినా, ఆయన నుండి ఒక మంచి సినిమా రాకపోదా అని ఆడియన్స్ ఎదురుచూస్తూ వచ్చారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే నిన్న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న చెలియా. గత చిత్రాల మాదిరిగానే, చెలియాలో కూడా చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏం లేకపోవడంతో రెండవ ఆట నుండి జనాలు సినిమా నడుస్తున్న థియేటర్ల జోలికి వెళ్లడం మానేశారు. చూసిన వారి కామన్ ఒపీనియన్ ఏంటంటే, మణిరత్నం అదే కథతో ఇంకెన్ని సినిమాలు తీస్తాడు అని.
అయితే అందరికన్నా ముందుగా ఈ మాట అన్నది 'మణి' భార్య సుహాసిని. చెలియా తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన సుహాసిని మణిరత్నం ని ప్రశ్నిస్తూ, "నాకైతే మీ సినిమాలు బోర్ తెప్పిస్తున్నాయి. ఇంకెన్ని రోజులు అవే రొమాంటిక్ ఫిలిమ్స్ తీస్తారు," అని అన్నారు. సుహాసిని చెలియా చూసి ఆందో చూడకుండా ఆందో తెలియదు కానీ, ఆమె వ్యాఖ్యలు నిజం చేస్తూ చెలియా కూడా మణిరత్నం ఈ మధ్య తీసినా సినిమాలనే కొంచెం అటు ఇటుగా మర్చి తీసినట్టు అనిపించింది. ఇప్పటికైనా ఆయన, కథల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురుకోవాల్సి వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



