చిరంజీవిని తప్పుపట్టిన డైరెక్టర్ భార్య
on Apr 8, 2017
దశాబ్దాల సినీ జీవితంలో చిరంజీవి వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉన్నారు. తన నటన, డాన్సులతో అభిమానుల్ని మెప్పించాడు కానీ, మెగాస్టార్ అనవసర విషయాల్లో తల దూర్చిన సందర్భాలు అసలు మనం విని ఉండం. అలాంటి చిరుకి నిన్నటి తరం దర్శకుడు జంధ్యాల భార్య అన్నపూర్ణ గారు చురకలు అంటించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు తాజా సీజన్ కి చిరంజీవి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ విదితమే. చివరి వారం ఎపిసోడ్ కి చిరంజీవి కి అత్యంత ఆప్తుడైన బ్రహ్మానందం స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.
ఈ సందర్భంగా, బ్రహ్మి తన సినీ ప్రయాణంలో జరిగిన కొన్ని విషయాలు నెమరు వేసుకున్నారు. తనకు జీవితాన్నిచ్చిన గురువు గారు జంధ్యాల గురించి మాట్లాడుతూ "జంధ్యాల గారు ఒక ఈవెంట్ కి వచ్చి, తాను తాగినట్టు తెలిసిపోతుందా అని అడిగారని" చెప్పారు. ఈ విషయం అక్కడున్న అందరికీ నవ్వు తెప్పించినా, జంధ్యాల కుటుంభ సభ్యులకి ఇబ్బంది కలిగించింది. జంధ్యాల బ్రహ్మానందంకి ఫోన్ చేసి ఆలా ఎందుకు మాట్లాడావ్ అని కడిగేసారంట. చివరికి, బ్రహ్మి తాను చేసిన తప్పుకి క్షమాపణలు కోరాడట. చిరంజీవి లాంటి వారు బ్రహ్మానందం ఆలా నోరు జారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటే వారించక పోవడం విస్మయానికి గురి చేసింది అని తన బాధని వెల్లిబుచ్చుకున్నారు అన్నపూర్ణ గారు.