రెడీ అవుతున్న లోకేష్... వరుస అప్‌డేట్లిస్తారా?
on Jan 12, 2023

నిన్నటిదాకా ఒక తీరు... రేపటి నుంచి మరో తీరు అన్నట్టుంది లోకేష్ కనగరాజ్ స్టైల్. నిన్నటిదాకా విజయ్ వారిసు కోసం ఓపిగ్గా వెయిట్ చేశారు లోకేష్. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కింది వారిసు సినిమా. దిల్‌రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రష్మిక ఈ సినిమాలో నాయికగా నటించారు. తమిళనాడులో ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పోలిస్తే తునివుకు మంచి మార్కులే పడ్డాయి. వారిసు సినిమాను తన భార్యతో కలిసి చూశారు విజయ్. అటు లోకేష్ కనగరాజ్ కూడా చెన్నైలో సినిమా చూశారు. ఆల్రెడీ విజయ్‌తో మాస్టర్ సినిమా చేశారు లోకేష్. ఇప్పుడు విజయ్ 67వ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఇది కూడా లోకేష్ తరహా మాస్ సినిమా అనే ఫీలర్ ఆల్రెడీ ఉంది.
గ్యాంగ్‌స్టర్ల సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోనే జయం రవి కూడా కీ రోల్ చేస్తారనే టాక్ ఉంది. త్రిషను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా స్కోప్ ఉండదు. మరి త్రిష ఈ సినిమాకు సంతకం చేశారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సంక్రాంతి పండగ పూర్తి కాగానే లోకేష్ సెట్స్ కి వెళ్తారు విజయ్. ``నిన్నటిదాకా వారిసు సినిమా కోసం ఆగాను. ఆ సినిమాకు రావాల్సినంత ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు వారిసు కంప్లీట్ అయింది. త్వరలోనే విజయ్ 67 అప్‌డేట్స్ ఇస్తాను. అందరూ సిద్ధంగా ఉండండి`` అంటూ ఫ్యాన్స్ తో చెప్పారట లోకేష్.
తనదైన యూనివర్శ్‌లో హీరోలను ఇన్వాల్వ్ చేస్తున్న లోకేష్, విజయ్ 67లో ఎలాంటి సస్పెన్స్ లు ఉంచారో, విజయ్‌ని ఇంకెలా చూపిస్తారోనని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత విక్రమ్2, ఖైదీ 2 సినిమాలు చేయాల్సి ఉంది లోకేష్. తనదగ్గరున్న కథలతో ఇంకో పదేళ్లు తాను బిజీగా ఉండటం ఖాయం అంటున్నారు ఈ డైరక్టర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



