నైజాంలో 'వీరసింహారెడ్డి' గర్జన.. 150 కార్లతో భారీ ర్యాలీ!
on Jan 12, 2023

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలయ్య సినిమా వచ్చిందంటే మాములుగానే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా సీడెడ్ లో జాతరను తలపించే సెలబ్రేషన్స్ జరగడం సహజం. అయితే ఇప్పుడు 'వీరసింహారెడ్డి'కి నైజాంలో కూడా ఆస్థాయి సెలబ్రేషన్స్ జరగడం విశేషం.
'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో 'వీరసింహారెడ్డి'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఐదు కోట్ల గ్రాస్ సాధించిందంటే ఈ సినిమాపై నైజాంలో ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా విడుదల సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో జరిగాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ లో 600 మంది బాలయ్య అభిమానులు 'వీరసింహారెడ్డి' సినిమా చూడటానికి దాదాపు 150 కార్లలో థియేటర్ కి ర్యాలీగా వెళ్లారు. బాలయ్య సినిమాల్లో సుమోల సీన్స్ ని తలపించేలా రోడ్డు మీద వరుసగా కార్లు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



