లెజెండరీ ఫైట్ మాస్టర్ జూడో రత్నం కన్నుమూత!
on Jan 27, 2023
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెజెండరీ ఫైట్ మాస్టర్ జూడో రత్నం(92) కన్నుమూశారు. తమిళ్, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. 1200కు పైగా సినిమాలు చేసిన ఆయన.. అత్యధిక చిత్రాలకు పని చేసిన స్టంట్ మాస్టర్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, రజినీకాంత్, చిరంజీవి వంటి ఎందరో స్టార్ల సినిమాలకు ఆయన వర్క్ చేశారు. ముఖ్యంగా రజినీకాంత్ నటించిన ఎన్నో సినిమాలకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే నటుడిగానూ అలరించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కళైమామణి అవార్డు ప్రధానం చేసింది. కోలీవుడ్ లో లెజెండ్ గా ఎదిగిన ఆయన 92 ఏళ్ల వయస్సులో ఈ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. రజినీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
