`భారతీయుడు-2` ఆగిపోలేదు!!
on Feb 13, 2019
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో `భారతీయుడు-2` రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా లాస్ట్ మంతే స్టార్ట్ కావాల్సింది కానీ, కొన్ని ఆనివార్య కారణాల సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇక దీనిపై స్పందిస్తూ కమల్ హాసన్ ` సినిమా ఆగిపోలేదని ` క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ `భారతీయుడు-2` షూటింగ్ చెన్నై లో ప్రారంభమైనట్లు సమాచారం అందుతోంది. మెయిన్ పార్ట్ అంతా అబ్రాడ్ లో ప్లాన్ చేసారు. చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసారట దర్శకుడు. కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో శింబు ఇంపార్టెంట్ క్యారక్టర్స్ చేస్తున్నారట. అనిరుథ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రాఫ్రర్ గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 లో సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
