సామ్ బాటలో కృతి శెట్టి కూడా వెళుతుందా!
on Jul 12, 2022

సంచలన చిత్రం `ఉప్పెన`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కృతి శెట్టి.. ఆపై `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` విజయాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన నాలుగో చిత్రం `ది వారియర్` విడుదలకు సిద్ధమైంది. రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ఈ బైలింగ్వల్ మూవీ.. జూలై 14న తెరపైకి వస్తోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో తెలుగునాట వరుసగా నాలుగు విజయాలను అందుకున్న కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత కూడా.. జూలై ఫస్టాఫ్ లో రిలీజైన సినిమాతోనే టాలీవుడ్ లో నాలుగో విజయం చూసింది. `ఏమాయ చేసావె`, `బృందావనం`, `దూకుడు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సామ్ నటించిన నాలుగో తెలుగు చిత్రం `ఈగ` 2012 జూలై ఫస్టాఫ్ లో బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ బాట పట్టింది. మరి.. సామ్ లాగే కృతి శెట్టి కూడా జూలై ఫస్టాఫ్ లోనే రిలీజ్ అవుతున్న నాలుగో తెలుగు చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
కాగా, `ది వారియర్`కి కోలీవుడ్ కెప్టెన్ లింగు స్వామి దర్శకత్వం వహించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



