స్థల వివాదంలో రానా దగ్గుబాటి.. కోర్టు నోటీసులు!
on Jul 12, 2022

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి స్థల వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన కుటుంబానికి చెందిన ఓ స్థలాన్ని లీజ్ కి ఇచ్చి, గడువు ముగియకముందే ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఓ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. దీంతో ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఫిల్మ్ నగర్ లో ప్రాంతంలో ఉన్న 2200 గజాల స్థలాన్ని దగ్గుబాటి కుటుంబం ఓ వ్యక్తికి లీజుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది సురేష్ బాబు, వెంకటేష్ పేర్లపై ఉందట. అయితే లీజ్ గడువు ముగియకముందే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సదరు వ్యక్తి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం. అంతేకాదు, ఓ వైపు ఈ వివాదం జరుగుతుండగానే స్థలంలో సగ భాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించినట్లు తెలుస్తోంది. కోర్టు నోటీసుల నేపథ్యంలో తన లాయర్ తో కలిసి తాజాగా రానా కోర్టుకి హాజరైనట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



