భారీ నష్టాల దిశగా 'ది వారియర్'!
on Jul 17, 2022

ఇటీవల థియేటర్స్ లో 'అంటే సుందరానికీ', 'విరాట పర్వం', 'పక్కా కమర్షియల్' వంటి మీడియం రేంజ్ సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలిన నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'ది వారియర్' అయినా ఆడియన్స్ కి ఆకట్టుకొని విజయాన్ని అందుకుంటుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ మొదటి షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న వారియర్ కూడా బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చేలా ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.7.02 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.30 కోట్ల షేర్, మూడో రూ. 2.41 కోట్ల షేర్ రాబట్టిన వారియర్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో 11.73 కోట్ల షేర్ వసూలు చేసింది. మూడో రోజుల్లో నైజాంలో 3.87 కోట్లు, సీడెడ్ లో 1.94 కోట్లు, ఆంధ్రాలో 5.92 కోట్ల షేర్ రాబట్టింది. తమిళనాడులో 60 లక్షలు, రెస్టాఫ్ ఇండియా 62 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షల షేర్ తో కలిపి వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో 13.45 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
వరల్డ్ వైడ్ గా దాదాపు 40 కోట్ల బిజినెస్ చేసిన వారియర్ మూవీ మూడు రోజుల్లో 34 శాతం మాత్రమే రికవరీ సాధించింది. ఈరోజు ఆదివారం కావడంతో దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. ఈ మూవీ ఫుల్ రన్ లో 50-60 శాతం మాత్రమే రికవర్ చేసే ఛాన్స్ ఉందని, అదే జరిగితే భారీ నష్టాలు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



