బాహుబలి ఆడియో: రాజమౌళి ఎమోషనల్ స్పీచ్
on Jun 14, 2015
.jpg)
రాజమౌళి ప్రతి సినిమాకి అతని కుటుంబ సభ్యులు టీమ్ గా వర్క్ చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారి గురించి ఎప్పుడూ రాజమౌళి ప్రస్తావించలేదు. బాహుబలి ఆడియో ఫంక్షన్ లో మాత్రం తన కొడుకుతో సహా కుటుంబసభ్యులందరిని పొగడ్తలల్తో ముంచెత్తారు రాజమౌళి.
‘‘ప్రతి ఒక టెక్నిషియన్ ఈ సినిమా కోసం హార్డ్‌వర్క్ చేశాడు. ఈ టీమ్‌లో ముఖ్యంగా కొందరి గురించి చెప్పుకోవాలి. టీం అలసిపోయిన ప్రతిసారి శివగామి క్యారెక్టర్ చేసిన రమ్యకృష్ణగారు మనం ఒక గొప్ప సినిమా చేశామని చెప్పి ఎనర్జీ ఇచ్చారు. ఆవిడ ఈ సినిమాలో పార్ట్ కావడం పట్ల ఆనందంగా ఉంది. అలాగే సత్యరాజ్‌గారు జెంటిల్‌మేన్. ఎంతో సీనియర్ యాక్టర్ అయినప్పటికీ డైరెక్టర్‌కి ఎంతో గౌరవమిచ్చేవారు. నాజర్‌గారు ఎక్స్‌పీరియెన్స్ అంత నా వయసుంటుందేమో..నా కో టెక్నిషియన్‌లా ఫీలవుతుంటాను. మనం ఏ సినిమా చేసినా క్లాసిక్‌లా నిలవాలని ఆయన అన్నారు. ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. నేనొక క్లాసిక్ మూవీ తీశానని అనుకుంటున్నాను. తమన్నా ప్రొఫెషనల్ హీరోయిన్. బల్గేరియాలో చలికి టెక్నిషియన్స్ అయిన మేం కూడా వెనుకాడతుంటే చలికి భయపడకుండా షాట్ చేసింది. కమిట్ మెంట్ ఉన్న నటి. దేవసేన క్యారెక్టర్‌ను అనుష్క తప్ప ఇంకెవరు చేయలేరు. ఎవరైనా హీరోయిన్‌తో మళ్లీ మళ్లీ నేను పనిచేయాలనుకుంటే నా ఫస్ట్ ప్రిపెరెన్స్ అనుష్కకే ఉంటుంది.
ప్రభాస్‌తో జానపద సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. నా సినిమాలో హీరో కంటే విలన్ బలంగా ఉండాలి. అలాంటప్పుడు మేం రానా అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కానీ నాకున్న ఒకే అప్షన్ తనే. ముందు కథ వినగానే ఏం చెప్పకుండా వెళ్లిసోయాడు. నాలుగురోజుల తర్వాత వచ్చి ఇప్పుడే హీరోగా చేస్తున్నాను. అలాంటిది విలన్‌గా చేయమంటున్నారు..ఎం చేయాలి అని అడిగాడు. నేను రానా ఈ సమయంలో నువ్వే డిసిషన్ తీసుకోవాలి. నేను నీ క్యారెక్టర్ గురించి ఏదైతే చెప్పానో దాన్ని తెరపై చూపిస్తానని చెప్పాను. రెండు, మూడు గంటల్లో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. రానా తను చాలా సాఫ్ట్ పర్సన్.
మా నాన్నగారు విజయేంద్రప్రసాద్‌గారి నుండే క్యారెక్టర్‌ను డ్రెమటైజేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నిజంగా రమా తోడు లేకుండా ఈ సినిమా చేసుండేవాడిని కాదు. కీరవాణిగారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గైడెన్స్ చాలా బాగుంటుంది. అలాంటి సంగీత దర్శకుడు ఎవరికీ దొరకడు. ఈ సినిమా షూటింగ్ ఏ ఆటంకం లేకుండా జరిగిందంటే కారణం వల్లిగారే. మా అబ్బాయి కార్తికేయ. ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులన్నీ తనే చూసుకున్నాడు. తను బాగా వర్క్ చేశాడని ఎప్పుడూ చెప్పలేదు. అయితే తప్పులకి తననే తిట్టేవాడిని..వాడు వాటన్నింటినీ భరించాడు.
ఛత్రపతి సినిమా టైమ్‌లో నేను, ప్రభాస్ బాగా కలిసిపోయాం. ఈ సినిమా విషయానికి వస్తే నువ్వు గొప్ప సినిమా తీస్తున్నావని నా వెన్ను తట్టింది ప్రభాస్. డార్లింగ్..మీరు ఏ సినిమా తీస్తున్నారో తెలుసా..మీరు తెలుగు సినిమా తీయడం లేదు. ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు తెలుసా..అనేవాడు. ఆరు సంవత్సరాల క్రితం ఓ పెద్ద సినిమా చేస్తున్నామని, నాలుగు సంవత్సరాల క్రితం బాహుబలి లైన్ రఫ్‌గా తనకి చెప్పాను. మూడు సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథంతా చెప్పాను. రెండు సంవత్సరాల క్రితం తనని ఒక సంవత్సరం పాటు డేట్స్ అడిగాను. అయితే తను రెండు సంవత్సరాలు డేట్స్ ఇవ్వడమే కాదు. ఈ రెండేళ్లలో ఏనాడూ..ఎంటిది ఇలా తీస్తున్నారని ఎవరిని అడగలేదు. మాకు ప్రతిసారి బూస్టప్ ఇచ్చాడు. మా అందరికంటే తనకే ఈ సినిమాపై ఎక్కువ నమ్మకం ఉండేది. ఆ నమ్మకమే మా అందరికీ బలాన్నిచ్చింది. తనని బాగా కష్టపెట్టాను. కానీ ప్రతి కష్టాన్ని భరించి పూర్తి చేశాడు అందుకు తనకి థాంక్స్’’ అని రాజమౌళి అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



