మైత్రితో కిరణ్ అబ్బవరం 'మీటర్'
on Jul 15, 2022

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకులకు అలరించిన కిరణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్, 'వినరో భాగ్యము విష్ణు కథ' గ్లింప్స్ తో ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో.. తాజాగా మరో కొత్త మూవీ అప్డేట్ తో వచ్చాడు.
క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమాలో కిరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి రమేష్ కావూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు(జులై 15) కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి 'మీటర్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కిరణ్ మాస్ స్టెప్పేస్తూ కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ సి.దిలీప్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



