పాపులర్ యాక్టర్, డైరెక్టర్ ప్రతాప్ పోతన్ కన్నుమూత
on Jul 15, 2022

సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతాప్ పోతన్ వయసు 71 సంవత్సరాలు. ఆయన బహుభాషా నటుడు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. మలయాళంలో 1979లో 'తకార', 1980లో 'చమరం' చిత్రాలతో ఉత్తమ నటునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు.
తెలుగులో అమాయకుడు కాదు అసాధ్యుడు, జేగంటలు, జస్టిస్ చక్రవర్తి, డబ్బు డబ్బు డబ్బు, కలలు కనే కళ్లు, ప్రజారాజ్యం, ఆకలి రాజ్యం, పుష్పక విమానం, కాంచన గంగ, చుక్కల్లో చంద్రుడు, మరో చరిత్ర (2010), వీడెవడు తదితర చిత్రాల్లో నటించిన ప్రతాప్ పోతన్.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'చైతన్య' (1991) చిత్రానికి దర్శకత్వం వహించారు. 1985లో 'మీండుమ్ ఒరు కాదల్ కథై' అనే తమిళ్ మూవీతో డైరెక్టర్‌గా మారారు ప్రతాప్ పోతన్. దానితో ఉత్తమ తొలిచిత్ర దర్శకునిగా ఇందిరా గాంధీ అవార్డును అందుకున్నారు.
ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట నటి రాధికను 1985లో వివాహం చేసుకున్న ఆయన, ఏడాది మాత్రమే ఆమెతో కాపురం చేసి, 1986లో విడాకులిచ్చారు. ఆ తర్వాత 1990లో సీనియర్ కార్పొరేట్ ప్రొఫెషనల్ అయిన అమల సత్యనాథ్‌ను పెళ్లాడి, 22 సంవత్సరాల కాపురం తర్వాత 2012లో విడిపోయారు. వారికి కేయ అనే కుమార్తె ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



