మీడియాకు క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్!
on Jul 21, 2022

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కన్నడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సుదీప్ చెన్నై, కొచ్చి, హైదరాబాద్ కు చెందిన మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పాడు.
సుదీప్ హీరోగా నటించిన 'విక్రాంత్ రోణ' మూవీ జులై 28న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీని ప్రమోట్ చేసే పనిలో ఉన్న సుదీప్ ఈరోజు(జులై 21న) చెన్నై, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహించాల్సి ఉంది. మీడియాకు ముందుగానే సమాచారం కూడా అందించారు. అయితే సుదీప్ స్వల్ప అనారోగ్యం పాలవడంతో ఈ ప్రెస్ మీట్లను రద్దు చేశారు. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని, మీడియా మిత్రులు తనకు క్షమించాలని కోరుతూ సుదీప్ ట్వీట్ చేశాడు. మళ్ళీ త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ట్వీట్ లో పేర్కొన్నాడు.

కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిలిమ్స్ ఇండియా బ్యానర్స్ పై షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుప్ భండారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు నటించారు. ఈ మూవీలోని "రా రా రక్కమ్మ" సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



