హీరోయిన్ కాకముందు నుంచే 'బన్నీ'కి బిగ్ ఫ్యాన్ ని!
on Jul 21, 2022

'పుష్ప: ది రైజ్' తో నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ సైతం బన్నీ మ్యానరిజమ్స్ కి, డ్యాన్స్ కి ఫిదా అయిపోయారు. అయితే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని మాత్రం తను సినిమాల్లోకి రాకముందు నుంచే బన్నీకి పెద్ద ఫ్యాన్ అంట. ఈ విషయాన్ని తాజాగా ఆమెనే చెప్పింది.
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్'(2015) సినిమాతో దిశా పటాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాతోనే సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 'ప్రాజెక్ట్ k' లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు అలరించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోలు బన్నీ, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'పుష్ప' తర్వాత నార్త్ ఆడియన్స్, బాలీవుడ్ బన్నీ టాలెంట్ ని గుర్తిస్తున్నారు. కానీ తాను మాత్రం బన్నీని ఎప్పటినుంచో అభిమానిస్తున్నానని, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే బన్నీకి బిగ్ ఫ్యాన్ ని అని దిశా తెలిపింది. ఇక 'ప్రాజెక్ట్ k'లో నటించడంపై స్పందిస్తూ.. "ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన ప్రభాస్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని దిశా చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



