జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న 'RRR'.. ఎప్పుడంటే?
on Jul 21, 2022

వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కలెక్షన్స్ మరింత పెరగబోతున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ జపాన్ లో విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా మూవీ టీమ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్స్ లో భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇక మే 20 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి వండర్ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎందరో ఆశపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాని వివిధ దేశాలలో థియేటర్స్ లో విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
నిజానికి 'ఆర్ఆర్ఆర్'ని జపాన్, చైనా వంటి దేశాల్లో విడుదల చేస్తామని గతంలోనే మూవీ టీమ్ తెలిపింది. అయితే తాజాగా జపాన్ లో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ క్రేజీ మూవీ అక్టోబర్ 21న జపాన్ థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే చైనా మరియు ఇతర దేశాల్లోనూ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ తేదీలను కూడా ప్రకటించే అవకాశముంది. ఈ మూవీ మరికొన్ని దేశాల్లో విడుదలైతే టోటల్ కలెక్షన్స్ రూ.1500-2000 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



