మళ్లీ పెళ్లి కోసం జాతకం చెప్పించుకున్న గెటప్ శీను!
on Oct 17, 2022

గెటప్ శీను ఏది చేసినా అందులో ఒక వెరైటీ, ఒక ఫన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఐతే శీనుకి ఆల్రెడీ పెళ్లయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి కోసం జాతకం చెప్పించుకున్నాడు. శీను ఇటీవల కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఇక పనిలో పనిగా ఒక పెద్దావిడ చేత జ్యోతిష్యం కూడా చెప్పించుకున్నాడు. ఇలా జాతకం చెప్పించుకున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసేసరికి దానికి ఎన్నో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.
"ఫస్ట్ టైం ధైర్యంగా చెప్పించుకున్నా జాతకం. మలయాళం అర్థం కాదు కాబట్టి" అని టాగ్ లైన్ పెట్టాడు. మలయాళంలో ఆవిడ ఏదో చెప్తుంటే తల బాగా ఆడించాడు శీను. "కళ్యాణం?" అని అడిగేసరికి "సుందర్" అని ఆమె ఏదో చెప్పింది. దాంతో వాళ్ళ వైఫ్ సుజి కామెంట్ చేసింది "కళ్యాణం కావాలా నాయనా.. ఇంటికి రండి చేస్తాను" అంది. మరో నెటిజన్ ఐతే "అన్న కళ్యాణం సుందరంతో జరుగుతుంది అంటా" అని ఒక ఫన్నీ కామెంట్ పోస్ట్ చేసాడు. "ఆవిడ మాట్లాడుతోంది తమిళ్ లో.. మలయాళంలో కాదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



