ఎన్టీఆర్, అల్లు అర్జున్ లలో ఎవరు గొప్పో చెప్పిన మహానటి
on Aug 5, 2024

నో డౌట్ ఆ ఇద్దరి ఫెయిర్ సూపర్ గా ఉంటుంది.పైగా ఆ కాంబోలో వచ్చే సినిమా తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే విషయాన్నీ కీర్తి సురేష్(keerthi suresh)బల్ల గుద్ది మరి చెప్తుంది. ఇంతకీ తను ఏం చెప్తుందో చూద్దాం.
మహానటి తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన కీర్తి తాజాగా ఫిలింఫేర్ ని తన ఖాతాలో వేసుకుంది. నాని(nani)హీరోగా వచ్చిన దసరా(dasara)మూవీకి గాను ఉత్తమ నటి కేటగిరి లో ఆ అవార్డుని అందుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)గురించి పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.ఎప్పటినుంచో ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే కోరిక ఉంది. మా ఇద్దరి జోడి కూడా సూపర్ గా ఉంటుంది. ఎన్టీఆర్ ని మొదటి సారి మహానటి ఆడియో లాంచ్ లో చూసాను. చాలా మంచి వ్యక్తి. ఎంతో ఎనర్జటిక్ గా ఉంటారు.మహానటి హిట్ తర్వాత మా టీం అందరికి పార్టీ కూడా ఇచ్చారని చెప్పింది. ప్రెజంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అయితే ఒక రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
అదే విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)గురించి కూడా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.నాకు అల్లు అర్జున్ లా లైఫ్ ని లీడ్ చెయ్యాలని ఉంది.ప్రజల్లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనలా డాన్స్ చేయాలని ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు కూడా బన్నీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇస్తున్నాయి. కీర్తి రీసెంట్ గా తమిళంలో రఘు తాతా అనే మూవీ చేసింది. అగస్ట్ 15 న విడుదలకి ముస్తాబు అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



