'దేవర' సెకండ్ సాంగ్.. మామూలు అరాచకం కాదు...
on Aug 5, 2024

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరో సినిమా వస్తుందంటే.. అదిరిపోయే ఇంట్రో సాంగ్, డ్యూయట్ లు ఆశిస్తారు ప్రేక్షకులు. అసలే ఎన్టీఆర్ నుంచి సోలో మూవీ వచ్చి ఏకంగా ఆరేళ్ళు అవుతుంది. రెండేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మల్టీస్టారర్ కావడంతో పాటు.. సబ్జెక్టు దృష్ట్యా అందులో ఫ్యాన్స్ కోరుకునే పాటలు లేవు. అయితే ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసే బాధ్యత 'దేవర' (Devara) తీసుకుంది. (Devara Second Single)
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'ఫియర్ సాంగ్'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ గా 'చుట్టమల్లే' సాంగ్ (Chuttamalle Song)ని రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ లపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్ కి అనిరుధ్ కూల్ మ్యూజిక్ అందించాడు. అనిరుధ్ క్లాసీ మ్యూజిక్ కి తగ్గట్టుగా.. సింగర్ శిల్పారావు తనదైన గాత్రంతో మ్యాజిక్ చేసింది. ప్రియుడిని ఉద్దేశించి ప్రియురాలు పాడుకునే ఈ పాటలో ఆమె తన హస్కీ వాయిస్ తో మాయ చేసేసింది. ఇక గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మరోసారి తన కలం బలం చూపించారు. "చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు" అంటూ సాగిన ఈ పాటలో "నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా.. నీ రాకకు రంగం సిద్ధం చేశా" వంటి బ్యూటిఫుల్ లైన్స్ తో సాంగ్ ని మరోస్థాయికి తీసుకెళ్లారు.
ఇక లిరికల్ వీడియోలో ఎన్టీఆర్, జాన్వీల లుక్స్ బాగున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. బ్యూటిఫుల్ లొకేషన్, కాస్ట్యూమ్స్, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ.. సాంగ్ కి మరింత అందం తీసుకొచ్చాయి. ఇక ఇసుకలో మోకాళ్లపై ఎన్టీఆర్ వేసిన క్యూట్ స్టెప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ నుంచి ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చాలా కాలమైంది. మొత్తానికి లిరికల్ వీడియో చూస్తుంటే.. ఫుల్ వీడియో సాంగ్ థియేటర్లలో ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది అనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



