అప్పుడు 'నాన్నకు ప్రేమతో', ఇప్పుడు 'దేవర'.. ఎన్టీఆర్ ట్రెండ్ సెట్టర్!
on Aug 5, 2024

సినిమాలో హీరో డ్రెస్సింగ్ స్టైలో, హెయిర్ స్టైలో ఆడియన్స్ కి బాగా నచ్చి.. అది ఒక ట్రెండ్ లా మారిపోవడం సహజమే. ఇప్పటికే ఎందరో హీరోలు ఇలాంటి ట్రెండ్ సెట్ చేశారు. ముఖ్యంగా 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హెయిర్ స్టైల్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పుడు దాదాపు యూత్ అంతా అలాంటి హెయిర్ స్టైల్ లోనే దర్శనమిచ్చారు. ఇప్పుడు 'దేవర' (Devara)తో మరో కొత్త ట్రెండ్ కి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టాడు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి.. సెకండ్ సింగిల్ (Devara Second Single) అనౌన్స్ మెంట్ పోస్టర్ ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటినుంచి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ వేసిన బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబో షర్ట్ అందరికీ ఎంతో నచ్చింది. యూత్ ఈ షర్ట్ కొనడానికి పోటీ పడుతున్నారు. ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ ఇప్పటికే 'సోల్డ్ అవుట్' అని పెట్టాయంటే.. ఈ షర్ట్ పట్ల యూత్ లో ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇన్ స్టాగ్రామ్ వేదికగానూ పలువురు ఈ షర్ట్ లను విక్రయిస్తున్నారు. త్వరలోనే ఆఫ్ లైన్ లోనూ ఈ షర్ట్ లు దర్శనమిచ్చేలా ఉన్నాయి. మొత్తానికి ఒక్క పోస్టర్ తో మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



