రిపీట్ మోడ్ లో కీర్తి సురేశ్.. ఫస్ట్ నాని, నెక్ట్స్ సూర్య!
on Nov 26, 2021
అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో అలరించే కథానాయికల్లో కీర్తి సురేశ్ ఒకరు. `మహానటి`తో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి.. కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా నటనకు అవకాశమున్న చెల్లెలి పాత్రల్లోనూ కనిపిస్తూ విస్మయపరుస్తున్నారు. అలాగే, పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో కోలీవుడ్ స్టార్స్ విజయ్, శివ కార్తికేయన్ తో రిపీట్ మోడ్ లో సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. గత కొంతకాలంగా ఆ ఫీట్ కి దూరంగా ఉంటున్నారు. నాయికా ప్రాధాన్యమున్న పాత్రలవైపే మొగ్గు చూపడంతో.. స్టార్స్ తో మళ్ళీ మళ్ళీ నటించే దిశగా దృష్టి సారించలేకపోతున్నారీ కేరళకుట్టి. అయితే, ఇప్పుడిప్పుడే రూట్ మారుస్తున్న కీర్తి.. మళ్ళీ రిపీట్ మోడ్ పై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని సరసన `నేను లోకల్` తరువాత `దసరా` చేస్తున్న కీర్తి సురేశ్.. తాజాగా సూర్యతో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. `గ్యాంగ్` తరువాత సూర్య - కీర్తి కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ బాలా రూపొందించనున్నారు.
మరి.. విజయ్, శివ కార్తికేయన్ లతో రిపీట్ మోడ్ లోనూ విజయాలు సొంతం చేసుకున్న కీర్తి సురేశ్.. నాని, సూర్యతోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
