Home

»

Latest News

బైసెక్సువ‌ల్‌గా బోల్డ్ రోల్‌లో స‌మంత‌!

Nov 26, 2021

 

ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎలా వున్న‌ప్ప‌టికీ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో దూసుకుపోతోంది స‌మంత‌. ఆమె త‌న త‌ర్వాతి సినిమాకు సంత‌కం చేసింది. అది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఫేమ‌స్ సిరీస్ 'డౌన్‌ట‌న్ అబ్బే' డైరెక్ట‌ర్ ఫిలిప్ జాన్ రూపొందించే 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' అనే సినిమాలో ఆమె లీడ్ రోల్ పోషించ‌నుంది. ఈ మూవీలో సొంతంగా డిటెక్టివ్ ఏజెన్సీని న‌డిపై ఒక బైసెక్సువ‌ల్‌గా స‌మంత క‌నిపించ‌నుంది. "ఈరోజు 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్‌'తో నా జ‌ర్నీని ప్రారంభించ‌డంతో నాకోసం స‌రికొత్త ప్ర‌పంచం తెరుచుకుంది. అది మ‌నోహ‌ర‌మైన వ్య‌క్తిగ‌త క‌థ" అని వెరైటీ ప‌త్రిక‌కు తెలిపింది. ఫిలిప్ జాన్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి ఉత్సాహంతో ఉన్నాన‌ని కూడా ఆమె చెప్పింది.

"ఎంతో కాలంగా ఎవ‌రి ప్రాజెక్టుల‌నైతే ద‌గ్గ‌ర‌గా ఫాలో అవుతూ వ‌స్తున్నానో, ఆ డైరెక్ట‌ర్ ఫిలిప్ జాన్‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి నేను సంతోషిస్తున్నారు. ఆయ‌న తీసిన 'డౌన్‌ట‌న్ అబ్బే'కి నేను పెద్ద అభిమానిని. 'ఓ బేబీ' త‌ర్వాత మ‌రోసారి సునీత‌తో క‌లిసి ప‌నిచేయ‌డం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ మూవీలో నాది సంక్లిష్ట‌మైన క్యారెక్ట‌ర్‌. దాన్ని పోషించ‌డం నాకు ఒక స‌వాలు మాత్ర‌మే కాదు, ఒక మంచి అవ‌కాశం కూడా. సెట్‌లో దాన్ని చేయ‌డం కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పింది స‌మంత‌.

'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' మూవీలోని పాత్ర‌కు స‌మంత ఆడిష‌న్‌ను ఎదుర్కొంది. చివ‌రిసారిగా ఆమె 12 ఏళ్ల క్రితం 'ఏమాయ చేశావే' మూవీ కోసం ఆడిష‌న్‌కు వెళ్లింది. ఫిలిప్ జాన్‌తో క‌లిసి దిగిన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన స‌మంత‌, "ఒక స‌రికొత్త ప్ర‌పంచం.. నేను చివ‌రిసారిగా 2009లో 'ఏమాయ చేశావే' సినిమా కోసం ఆడిష‌న్‌కు వెళ్లాను. 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ ఆడిష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు అదే నెర్వ‌స్‌నెస్‌ను అనుభ‌వించాను. ఇది రోజూ ఆడిష‌న్‌కు వెళ్లే లాంటిది కాదు. 'బాఫ్టా' అవార్డు గెలుచుకున్న‌, మీ మోస్ట్ ఫేవ‌రేట్ సిరీస్ 'డౌన్‌ట‌న్ అబ్బే'ని తీసిన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన ఆడిష‌న్‌. ఫిలిప్ జాన్ స‌ర్ న‌న్ను ఎంచుకున్నందుకు ఆనందంతో గెంతుతున్నా.. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు సునీత తాటి, గురు ఫిలిమ్స్‌కు థాంక్స్‌. ఈ ఉత్తేజ‌క‌ర‌మైన ప్ర‌యాణాన్ని స్టార్ట్ చేయ‌డం కోసం ఎదురుచూస్తున్నా." అని రాసుకొచ్చింది.

దీనికి కామెంట్స్ సెక్ష‌న్‌లో రాశీ ఖ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ కంగ్రాచ్యులేష‌న్స్ చెప్పారు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత కెరీర్ ప‌రంగా స‌మంత మ‌రింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్పాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com