నా పేరు మరచిపోయా..కట్టప్ప అంటేనే పలుకుతున్నా
on Mar 26, 2017

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి-2 ప్రి రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ సత్యరాజ్ అన్న పేరు కన్నా కట్టప్ప అన్న పేరుతోనే నాకు ఫేమ్ వచ్చిందన్నారు. ఈ పేరుతోనే తనను చాలా మంది గుర్తిస్తున్నారని ఆయన చెప్పారు. షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా కట్టప్ప అంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చివరికి యూనిట్ కూడా తనను కట్టప్ప పేరుతోనే పిలిచే వారని..వాళ్లు కూడా కట్టప్ప సార్ షాట్ రెడీ అంటూ పిలిచేవారని సత్యరాజ్ అన్నారు. రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



