రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన కీరవాణి
on Mar 26, 2017

తాను సినిమాల నుంచి వైదలొగుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. తన సినీ ప్రస్థానం కొనసాగుతుందని ఆయన అన్నారు. సినిమాల నుంచి వైదొలగుతున్నట్లు రెండేళ్ల క్రితం కీరవాణి ప్రకటించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఆయన చేతిలో బాహుబలి-2 తప్ప మరే సినిమా లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇక దీనికి తెరదించకపోతే పరిస్థితులు దిగజారే అవకాశం ఉండటంతో కీరవాణి స్పందించారు. నా శ్రేయోభిలాషులందికీ శుభవార్త..నా సినీ జర్నీ కొనసాగుతుంది..నేను సినిమాలకు దూరం కాకుడదని 99 శాతం మంది కోరుకున్నారు. ఇందులో నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు కూడా ఉన్నారు..వారందరి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్వీట్ చేశారు. ఈ వార్త కీరవాణి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



