ఐశ్వర్య రాయ్ అయినా సరే అందమైన స్త్రీలని అది విడిచిపెట్టదు
on May 23, 2024
.webp)
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని నటి ఐశ్వర్య రాయ్( aishwarya rai) ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి కోట్లాది మంది సినీ ప్రేమికుల కళల రాణిగా కొలువుతీరి ఉంది. ఆ మాట కొస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్ అంతగత్తె కూడాను. పైగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు. అంతటి కీర్తి, బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఐశ్వర్యా రాయ్ ని ఎవరైనా చిన్న మాట అంటారా! కానీ ఒక నటి చాలా ఈజీగా కొంచం ఘాటైన వ్యాఖ్యలే చేసింది
ప్రస్తుతం ఫ్రాన్స్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (cannes film festival) జరుగుతుంది. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఏకైక ఫిలిం ఫెస్టివల్ ఇదే. ప్రపంచ సినీ రంగానికి చెందిన అతిరథ మహారధులు ఇందులో పాల్గొంటారు. పైగా చాలా తక్కువ మందికే ఆహ్వానం లభిస్తుంది. అలాంటి ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ హాజరయ్యింది. ఇప్పుడనే కాదు హాజరైన ప్రతి సారి ఆమె ధరించే వస్త్రాలు పలువురిని ఆకర్షిస్తాయి. ఈ సారి కూడా ఒక వెరైటీ డ్రెస్ ధరించి చూపరులని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని చూసిన కస్తూరి (kasturi) చూసింది. ఇక తనదైన స్టైల్లో ఐశ్వర్య అందం పై కామెంట్స్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీలను కూడా కాలం విడిచిపెట్టదు. ఐశ్వర్య గడియారాన్ని వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదు .ఆమె అందంగానే ఉండేది.కానీ ప్లాస్టిక్ ఆమె కలకాలం అందాన్ని నాశనం చేసింది.కాలం తో పాటు అన్ని మారతాయి అని ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది
.webp)
ఇక కస్తూరి విషయానికి వస్తే తెలుగు తమిళ భాషలకి చెందిన చాలా సినిమాల్లో నటించింది. సీరియల్స్ లో కూడా ప్రేక్షకులకి నిత్యం దగ్గరగా ఉంటుంది. కొంత కాలం నుంచి పలువురు సినీ ,రాజకీయ నాయకుల సెలబ్రిటీస్ పై తన దైన స్టైల్లో విమర్శల బాణాలు సంధిస్తు వస్తుంది. వాళ్లలో ఇప్పుడు ఐశ్వర్య కూడా చేరింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఐశ్వర్య హాజరవ్వడం ఇది పంతొమ్మిదివ సారి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



