ప్రభాస్ కల్కి బెనిఫిట్ షో లేదు.. అందుకు కారణం వీళ్ళే
on May 23, 2024
.webp)
భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అగరబత్తి అనేది ఎంత నిజమో. హీరోకి అభిమానికి అనుసంధానమైనది బెనిఫిట్ షో అనేది కూడా అంతే నిజం. బెనిఫిట్ షో (benefit show) ఎప్పుడు పుట్టిందో కరెక్ట్ గా చెప్పలేం గాని సుదీర్ఘ కాలం నుంచే తెలుగు సినిమా ఒడిలో ఓలలాడుతూ తెలుగు కళామ తల్లికి తన వంతు గురుదక్షణ ని ఇచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ బంధం తెగిపోనుంది
నైజాం కి చెందిన ఎగ్జిబిటర్లు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలను రద్దు చెయ్యాలని తీర్మానం చేసారు. ఏకపక్షంగా వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకులు,హీరోల అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఖచ్చితంగా అమలవుతుందా లేదా అనేది చూడాలి.ఆలాగే దీనిపై బడా నిర్మాతలు ఏమంటారో కూడా చూడాలి. అదే టైం లో డిస్ట్రిబ్యూటర్ ల స్పందన కూడా తెలియాలి. ఒక పక్క ప్రభాస్ (prabhas) కల్కి (kalki) జూన్ 27 న పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ టైం లో థియేటర్ ఓనర్స్ తీసుకున్న నిర్ణయం కల్కి కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా బడా హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి

తెల్లవారుజామున మూడు గంటలకి, మార్నింగ్ ఏడు గంటల కి షోస్ పడటం వల్ల టాక్ కి సంబంధం లేకుండానే పెద్ద సినిమాలకి భారీ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది ఎగ్జిబిటర్స్ వల్ల కలెక్షన్ పై భారీ తేడా చూపించే అవకాశం ఉంది. ఏది ఏమైనా మార్పు సహజం. థియేటర్ ఓనర్స్ తమ నిర్ణయం మార్చుకుంటారేమో చూడాలి. పైగా ఫ్యాన్స్ తలుచుకుంటే బెనిఫిట్ షో స్ పడి తీరాల్సిందే అనే మాట కూడా సినీ మార్కెట్ లో ఉంది. ఒక్కటి మాత్రం నిజం సోషల్ మీడియాలో వస్తున్న బెనిఫిట్ షో రద్దు వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిరుత్సాహంతో ఉన్నారు. ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ ఓనర్స్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



