నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా 'కార్తికేయ-2'!
on Aug 17, 2022
ఆగస్టు 13న విడుదలైన 'కార్తికేయ-2' నాలుగు రోజుల్లోనే రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టి నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటిదాకా నిఖిల్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రూ.16.55 కోట్లతో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఉండగా.. ఇప్పుడు 'కార్తికేయ-2' నాలుగు రోజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. మొదటి రోజు రూ.3.50 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.81 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.23 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.2.17 కోట్ల షేర్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ జోరు చూపిస్తున్న ఈ చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో రూ.13.71 కోట్ల షేర్(21.35 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. నాలుగు రోజుల్లో నైజాంలో రూ.5 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.2.14 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.6.57 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.
నార్త్ ఇండియాలో 1.20 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.05 కోట్ల షేర్, ఓవర్సీస్ 2.55 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 18.51 కోట్ల షేర్(32.15 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే బయ్యర్లకు రూ.5 కోట్లకు పైగా లాభాలు తీసుకురావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.15 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తెచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా నార్త్ లో రోజురోజుకి స్క్రీన్స్ పెంచుకుంటున్న ఈ సినిమా అక్కడ సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
Also Read