'సీతా రామం'ను బీట్ చేసిన 'కార్తికేయ-2'!
on Aug 21, 2022

ఆగస్ట్ 5 న విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు రెండూ మంచి కలెక్షన్స్ రాబడుతూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే అవి విడుదలైన 8 రోజులకి ఆగస్ట్ 13న విడుదలైన 'కార్తికేయ-2' అప్పుడే 'సీతా రామం' కలెక్షన్లను దాటేయడమే కాకుండా.. ఈరోజో రేపో 'బింబిసార' కలెక్షన్లను దాటే అవకాశముంది. 'కార్తికేయ-2' కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. ఎనిమిది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.20.30 కోట్ల షేర్(32.25 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. 8 రోజుల్లో నైజాంలో రూ.7.63 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.3.17 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.9.5 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.
నార్త్ ఇండియాలో 5.60 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.85 కోట్ల షేర్, ఓవర్సీస్ 3.90 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో రూ.31.65 కోట్ల షేర్(58 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. 8 రోజుల్లోనే బయ్యర్లకు రూ.18 కోట్లకు పైగా లాభాలు తీసుకురావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.40 కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సీతారామం వరల్డ్ వైడ్ గా 16 రోజుల్లో 31.05 కోట్ల షేర్ రాబట్టగా.. కార్తికేయ-2 కేవలం 8 రోజుల్లోనే దానిని దాటేసింది. అలాగే బింబిసార(16 రోజుల్లో 34.43 కోట్ల షేర్)ను కూడా త్వరలోనే క్రాస్ చేసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



