మెగాస్టార్ 'భోళాశంకర్' రిలీజ్ డేట్ వచ్చింది!
on Aug 21, 2022

కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో 'భోళాశంకర్' ఒకటి. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతున్నఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
రేపు(ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి వరుస సర్ ప్రైజ్ లు వస్తున్నాయి. తాజాగా 'భోళాశంకర్' విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2023న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. అందులో చేతిలో కీ చైన్ తిప్పుతూ స్టైలిష్ గా వాక్ చేస్తున్న చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



