రేపే 'గాడ్ ఫాదర్' టీజర్.. మెగా సందడి షురూ!
on Aug 20, 2022

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ సందడి మొదలవుతోంది.
మెగాస్టార్ పుట్టినరోజు(ఆగస్టు 22) కానుకగా ఒక రోజు ముందుగానే ఆగస్టు 21న 'గాడ్ ఫాదర్' టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టైంని కూడా ఫిక్స్ చేశారు. రేపు(ఆగస్టు 21) సాయంత్రం 6:30 కి టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు.
.webp)
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



