దిల్‌రాజు హీరోయిన్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే..!
on Jul 25, 2023

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు తన వారసులుగా హర్షిత్, హన్షితలుగా సినీ రంగంలోకి తీసుకొచ్చారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌చేస్తూ మినిమం బడ్జెట్‌లో సినిమాలు తీస్తున్నారు. అందులో భాగంగా చేసిన తొలి ప్రయత్నం `బలగం` . ఈ ఏడాది చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా నిర్మాతలు పెట్టిన దానికి ఐదు రెట్లకు పైగా లాభాలను తెచ్చి పెట్టిన ఆ సినిమా తర్వాత ఈ బ్యానర్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో `ఆకాశం దాటి వస్తావా` అనే సినిమాను అనౌన్స్ చేశారు.
కొరియోగ్రాఫర్ యశ్‌ని హీరోగా, శశికుమార్ అనే డైరెక్టర్‌ని పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు తెరపడింది. కార్తీక మురళీధరన్ అనే మలయాళ హీరోయిన్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలిసిన సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి.కె.మురళీధరన్ కుమార్తె. ఈయన బాలీవుడ్‌లో త్రీ ఇడియట్స్, పీకే, పానిపట్, మొహంజదారో వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయన కుమార్తె ఈ కార్తీక మురళీధరన్.
అలాగని `ఆకాశం దాటి వస్తావా` సినిమా ఆమెకు తొలి సినిమా ఏం కాదు.. మలయాళంలో ఆమె ఇది వరకే రెండు సినిమాల్లో నటించింది. కామ్రేడ్ ఇన్ అమెరికా సినిమాలో దుల్కర్ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించింది. అలాగే అంకుల్ అనే సినిమాలో మమ్ముట్టితో నటించింది. తెలుగులో దిల్ రాజు బ్యానర్ ద్వారా అడుగు పెడుతోంది. మరి తెలుగులో ఈమె ఏ మేరకు రాణిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



