అల్లు అర్జున్ కి వీరాభిమానిని అన్న సాక్షి ధోని.. ఇది సార్ బన్నీ బ్రాండ్!
on Jul 25, 2023

'పుష్ప' సినిమాకి ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. 'పుష్ప'తో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారారు. సెలబ్రిటీలు సైతం బన్నీ పర్ఫామెన్స్ కి, మ్యానరిజమ్స్ కి ఫిదా అయ్యారు. అయితే 'పుష్ప' రాకముందు నుంచే బన్నీకి బిగ్ ఫ్యాన్ ని అంటున్నారు ఒక సెలబ్రిటీ. ఆమె ఎవరో కాదు లెజెండరీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని సతీమణి సాక్షి ధోని.
ఎం.ఎస్.ధోని 'ఎల్‌జీఎం'(LGM - Lets Get Married) అనే సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి. ప్రమోషన్స్ భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో.. నిర్మాత సాక్షి ధోని, హీరో హరీస్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాక్షి ధోని మాట్లాడుతూ "ఎల్‌జీఎం సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అందువల్ల తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్ని. ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూశాను. నేను తనకు పెద్ద అభిమానిని. మన లైఫ్‌లో రిలేషన్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇది. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తన మనసులో ఎలా ఫీల్ అవుతుంటుంది. దానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెరకెక్కించాం. ఆగస్ట్ 4ప మూవీ రిలీజ్ అవుతుంది" అన్నారు.
తాను అల్లు అర్జున్ అభిమానిని అని సాక్షి ధోని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. "ధోనికి నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఉంటే, ధోని ఇంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఇది సార్ బన్నీ బ్రాండ్" అంటూ పుష్ప డైలాగ్ శైలిలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



