కథ వినకుండానే 'బేబీ'ని రిజెక్ట్ చేసిన విశ్వక్ సేన్.. తప్పు చేశాడా?
on Jul 25, 2023

'బేబీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో తెలిసిందే. పది రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. వీక్ డేస్ అయినా, వర్షాలు వస్తున్నా బేబీ బాక్సాఫీస్ జోరుకి బ్రేక్ లు పడట్లేదు. చిన్న సినిమాలలో ఈ స్థాయి విజయాన్ని అందుకునే చిత్రాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా బేబీ నిలిచింది. అయితే ఇంతటి సంచలన చిత్రాన్ని కనీసం కథ కూడా వినకుండానే యంగ్ హీరో విశ్వక్ సేన్ రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.
'బేబీ' చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. ఆయన సంపూర్ణేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'హృదయ కాలేయం' అనే కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'కొబ్బరి మట్ట', 'కలర్ ఫొటో' సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించాడు. అయితే 'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' వంటి సినిమాలు తీసిన అతను, 'బేబీ' సినిమా తీశాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా 'బేబీ' తీయాలనుకున్నప్పుడు నిర్మాతలు తప్ప, ఆయనను ఎవరూ పెద్దగా నమ్మలేదట. ఈ విషయాన్ని సినిమా వేడుకలో స్వయంగా సాయి రాజేష్ చెప్పాడు. కథ చెప్పడానికి ఓ హీరోని కలవడానికి ప్రయత్నిస్తే, కనీసం కథ కూడా వినకుండానే, అతనితో అయితే సినిమా చేయనని ఆ హీరో రిజెక్ట్ చేశాడని సాయి రాజేష్ తెలిపాడు. కాగా ఆ హీరో ఎవరో కాదు.. విశ్వక్ సేన్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విశ్వక్ సేన్ సైతం 'వద్దు అంటే వద్దు' అని పరోక్షంగా ట్వీట్ చేయడం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
అయితే బేబీ సినిమాని వదులుకొని విశ్వక్ సేన్ తప్పు చేశాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ యూత్ లో మంచి క్రేజ్ అయితే సొంతం చేసుకున్నాడు కానీ, అతనికి బేబీ స్థాయి విజయమైతే దక్కలేదు. 60-70 కోట్ల సినిమా పడుంటే తన ఇమేజ్ ఒక్కసారిగా మరింత పెరిగేది అనడంలో సందేహం లేదు. అయితే విశ్వక్ సేన్ ఇమేజ్ కి బేబీ సినిమా సరిపోదనేవాళ్ళు కొందరు ఉండగా, అతని ఇమేజ్ తోడైతే సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టేదేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



