కమల్ హాసన్ క్లాసిక్ మూవీ టైటిల్‌పై కన్నేసిన రౌడీ!
on Mar 4, 2020

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్, అమల ప్రధాన పాత్రలు పోషించిన 'పుష్పక విమానం' ఒక క్లాసిక్‌గా ఇండియన్ సినిమాలో నిలిచింది. 1987లో వచ్చిన అది సంభాషణలు లేని, కేవలం రీరికార్డింగ్‌తో నడిచే సినిమా కావడం విశేషం. అలాంటి ఆ సినిమా టైటిల్‌పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ కన్నేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై 'పుష్పక విమానం' టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. ఇటీవలే ఆ బ్యానర్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ అతను నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' మూవీ అతనికి లాభాలు అందించింది.
ఆ మూవీ తర్వాత అతను 'పుష్పక విమానం'ను నిర్మించనున్నాడనే విషయం, ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ద్వారా వెల్లడైంది. ఆ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తాడా, లేక మునుపటి సినిమా తరహాలోనే మరో హీరోతో ఆ సినిమా నిర్మిస్తాడా?.. అనే విషయం తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ పేరుతో స్క్రిప్టును రాసిన డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరం. అయితే 'పుష్పక విమానం' లాంటి క్లాసిక్ టైటిల్‌తో ఈ రోజుల్లో సినిమా తియ్యాలని సంకల్పించడం మాత్రం ఒక సాహసమనే చెప్పాలి. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సమ్మర్‌కే దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



