కాంతార రికార్డు అవుట్.. ఆరు రోజుల్లోనే 400 కోట్లు!
on Oct 8, 2025

2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతార'కి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 'కాంతార చాప్టర్ 1'. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం విశేషం. (Kantara Chapter 1)
'కాంతార చాప్టర్ 1' చిత్రం ఫస్ట్ వీకెండ్ లో అంటే మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.335 కోట్ల గ్రాస్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ అదే జోరు చూపిస్తూ.. ఐదు, ఆరు రోజుల్లో కలిపి రూ.95 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే మొదటి ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ.430 కోట్ల గ్రాస్ రాబట్టింది అన్నమాట. దీంతో కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-2 మూవీగా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది.
అప్పుడు 'కాంతార' చిత్రం ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ రాబడితే.. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' చిత్రం మొదటి వారం కూడా పూర్తి కాకుండానే రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది. మరి ఫుల్ రన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



