కబాలి అంతా తూచేనట...!
on Jul 20, 2016
ఒక పక్క సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం "కబాలి" విడుదల సందర్భంగా హాలీడే ప్రకటించి తమ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండగా.. భారీకే బాప్ లాంటి అంచనాల నడుమ విడుదలవుతున్న రజనీకాంత్ "కబాలి" విడుదలకు మూడు రోజుల ముందే ఆన్ లైన్ లో లభ్యమవుతుందన్న వార్త ఆన్ లైన్ లో హల్ చల్ చేసింది. దీనిపై నిర్మాత కలైపులి థాను కోర్ట్ కేసు వేశారని, కొన్ని వెబ్ సైట్లు బ్లాక్ చేశారని కూడా చెప్పుకొన్నారు. అయితే.. అందరూ అనుకొంటున్నట్లుగా అసలు "కబాలి" ఆన్ లైన్ లో లీకే అవ్వలేదని తమిళ మీడియా స్పష్టం చేసింది. మరి ఈ లీకేజీ గోల అంతా కేవలం పబ్లిసిటీ కోసమేనా అని ఇప్పటివరకూ ఈ విషయాన్ని ఫాలో అవుతూ వస్తున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న "కబాలి" లాంటి సినిమాకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ అవసరమా అని తిట్టుకొంటున్నారు!