ఇరుముగన్ ఆడియో రిలీజ్ డేట్!
on Jul 20, 2016
ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం చెప్పండి. సరైన హిట్ పడక నానా బాధలు పడుతున్నాడు మన శివపుత్రుడు అదేనండి విక్రమ్. తమిళనాట స్థిరపడ్డ ఈ తెలుగు నటుడు నటించిన గత చిత్రాలు "ఐ, 10 ఎండ్రాతుకుళ్ళ" చిత్రాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఈసారి ప్రయోగం కాకుండా ఓ ఫక్తు కమర్షియల్ సబ్జెక్ట్ తో "ఇంకొక్కడు"గా మన ముందుకురానున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. విక్రమ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ మరియు సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. కాగా.. ఈ చిత్రం ఆడియోను ఆగస్ట్ 2న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది!