రావణాసురుడిగా యశ్!
on Jan 29, 2023
రావణాసురుడిగా యశ్ యస్ అంటారా? లేదా? బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ డిస్కషన్ పాయింట్ ఇదే. ఆల్రెడీ యశ్ నెక్స్ట్ సినిమా మీద క్యూరియస్‌గా ఉన్నారు జనాలు. కేజీయఫ్ ఐదు భాగాలుంటాయని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్‌లోనూ యశ్ కనిపిస్తారనే మాటలున్నాయి. మరి ఇన్నిటి మధ్య యశ్ ఏ మూవీలో రావణుడిగా నటించబోతున్నారు? అనేది చాలా మందికి ఉన్న డౌట్. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణంలో యష్ లంకేశ్వరుడిగా నటిస్తారని సమాచారం.
నిన్నమొన్నటిదాకా నితేష్ తివారి రామాయణంలో రాముడు రణబీర్‌కపూర్. రావణుడు హృతిక్ రోషన్. ఇది ఫిక్స్. కానీ బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్ లో నటించడం అవసరమా? అని ఆలోచిస్తున్నారట గ్రీక్ గాడ్ హృతిక్. అందుకే ఇప్పుడు మనసు మార్చుకున్నారట.
నితేష్ తివారితో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాతే హృతిక్ ఈ నిర్ణయం తీసుకున్నారట. తను తప్పుకుంటున్నట్టు ప్రకటించారట. మధు మంతెన, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రమిది. అన్నీ సరిగ్గా కుదురుతున్నాయనుకుంటున్న సమయంలో హృతిక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నారట నితేష్. మధుమంతెన హ్యాండిల్ చేసే టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ యశ్ వ్యవహారాలను నార్త్ లో చూస్తోందట. ఆ చనువుతోనే యశ్ ని రావణాసురుడి పాత్ర కోసం అడిగినట్టు సమాచారం. నితేష్ ఇచ్చిన బ్రీఫ్ నచ్చిందట రాకీభాయ్‌కి. అయితే చేయడానికి ఒప్పుకున్నట్టా? లేదా? అనే విషయం ఇంకా ఓపెన్‌గా చెప్పలేదట కేజీయఫ్ స్టార్.
ఒకవేళ రాకీభాయ్ యస్ చెబితే, నార్త్ వర్సెస్ సౌత్, ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు. ఒన్ ఇండియా ఒన్ సినిమా అనే కాన్సెప్ట్ లిటరల్‌గా అమలులోకి వచ్చినట్టు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
