'RC 16'లో విలన్ గా విజయ్ సేతుపతి!
on Jan 29, 2023
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు సాన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. తన తర్వాతి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారు. దీనికి తారక్ కూడా ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్-కొరటాల శివల చిత్రం వల్ల ఆలస్యం ఆలస్యం అవుతుందని భావించారు. ఇప్పటికే తన కోసం రెండేళ్లు బుచ్చిబాబు వెయిట్ చేస్తున్న సంగతి గమనించిన ఎన్టీఆర్ స్వయంగా ఈ స్క్రిప్టును రామ్ చరణ్ కి వినిపించమని చెప్పారు. రామ్ చరణ్ కి స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడు బుచ్చిబాబు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఆర్సీ 15 చిత్రం చేస్తున్నారు. శంకర్ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ తాజా చిత్రం అంటే ఆర్సీ 16 బుచ్చిబాబుతో సెక్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో బుచ్చిబాబు ఉన్నారు. ఈ మూవీలో మరోసారి ఆయన రామ్ చరణ్ కోసం ప్రతి నాయకుడిగా మరల విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో భారీ తారాగాణంతో ఈ సినిమాను బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. అన్ని భాషల నుంచి నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఆ మాత్రం ముందుచూపు తప్పనిసరి. ఇక ఉప్పెన సక్సెస్ లో కీలక భాగస్వామి అయిన విజయ్ సేతుపతిని ఈ మూవీకి కూడా తీసుకుంటే కోలీవుడ్ లో కూడా మరోసారి బజ్ క్రియేట్ అయి ఈ చిత్రానికి హైప్ వస్తుందని బుచ్చిబాబు భావిస్తున్నారు. మరి విజయ్ సేతుపతి ఈ సినిమాకు ఓకే చెబుతారా లేదా అనేది వేచి చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
