ఈ ఫీట్ సాధించిన ఏకైక ఫిల్మ్ 'కేజీఎఫ్ 2'
on Jul 16, 2022

రాకీ భాయ్ క్రేజ్ ఇప్పుడప్పుడే ముగిసేట్లు కనిపించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ ఐదు భాషల్లో కలిపి ఆర్మాక్స్ పవర్ రేటింగ్‌లో 90+ స్కోర్ సాధించిన మొట్టమొదటి మూవీగా చరిత్ర సృష్టించింది. పాండమిక్ తర్వాత థియేటర్లకు పూర్వ వైభవం తీసుకురావడంలో 'కేజీఎఫ్ 2' ప్రధాన పాత్ర పోషించింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌తో పాటు రాకీ భాయ్‌గా యశ్, అధీరగా సంజయ్ దత్ పర్ఫార్మెన్సులు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. రవీనా టాండన్ పర్ఫార్మెన్స్‌ను కూడా తక్కువ చేయడానికి లేదు.
బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డుల్ని బ్రేక్ చేసి, థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చేసిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి ఆర్మాక్స్ పవర్ రేటింగ్‌పై 90+ స్కోర్ సాధించిన ఫస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇదే కాదు, 2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒకటిగా ఐఎండీబీలో 8.5 రేటింగ్‌ను సాధించింది 'కేజీఎఫ్ 2'.
'బాహుబలి 2' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ ఫిల్మ్‌గా నిలిచిన ఈ మూవీ హిందీ వెర్షన్ రూ. 430 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా 6 వేల థియేటర్లు, ప్రపంచవ్యాప్తంగా 8 వేల థియేటర్లలో ఈ మూవీ రిలీజయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



