'లైగర్' థియేట్రికల్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే...
on Jul 16, 2022

విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తోన్న ఫిల్మ్ 'లైగర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో అనన్యా పాండే హీరోయిన్. 'సాలా క్రాస్‌బ్రీడ్' అనేది ట్యాగ్‌లైన్. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో మూవీని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో దూకుడు పెంచింది. ఇటీవల ఆవిష్కరించిన విజయ్ బోల్డ్ పోస్టర్ ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. అలాగే హీరో హీరోయిన్లు, డాన్సర్లపై చిత్రీకరించగా రిలీజ్ చేసిన "అక్డీ పక్డీ" సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ సాంగ్ ఇప్పటిదాకా 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
కాగా విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'లైగర్' ట్రైలర్‌ను జూలై 21న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్లు మోహరించి, తనపైకి దాడి చేయడానికి రెడీగా ఉంటే, వారి మధ్యలో ఉన్న విజయ్ వారిని ఎదుర్కోవడానికి సై అంటున్నట్లుగా కనిపిస్తున్నాడు.
ఇదివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండను మాత్రమే చూపించగా, ట్రైలర్‌లో మైక్ టైసన్ సహా ఇతర కీలక పాత్రధారులను చూపించడంతో పాటు కంటెంట్‌పై కూడా దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను కీలక పాత్రలు చేసిన ఈ మూవీని పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ మూవీని తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పాన్ ఇండియా ఫిల్మ్‌గా 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



