సాయిపల్లవి రెమ్యూనరేషన్, ఎస్సెట్స్ ఎంతో తెలుసా?
on Jul 16, 2022

దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన తారల్లో సాయిపల్లవి ఒకరు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ వస్తోందామె. 'ఫిదా' నుంచి మొదలుకొని నిన్నటి 'విరాటపర్వం' వరకు ఆమె చేసిన సినిమాల్లోని పాత్రలు ఆమె నట వైదుష్యానికి నిదర్శనంగా నిలిచాయి. ముఖ్యంగా 'శ్యామ్ సింగరాయ్'లో చేసిన రోజీ పాత్ర, 'విరాటపర్వం'లోని వెన్నెల పాత్ర ఆమెలోని నటిని మరింతగా వెలికితీశాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మన ముందుకు వచ్చిన 'గార్గి' మూవీలో సాయిపల్లవి నటనకు దాసోహం కానివాళ్లు లేరు. అంత గొప్పగా ఆ క్యారెక్టర్‌లో రాణించింది. అలాంటి పల్లవి ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది, అసలామె సంపాదించిన ఆస్తులేమిటి?.. అనే విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ కుతూహలం వ్యక్తం చేస్తుంటారు.
ఇటీవలి సమాచారం ప్రకారం సాయిపల్లవికి రూ. 29 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి కోటిన్నర దాకా తీసుకుంటోంది. ఆమె దగ్గర ఆడి Q3, లాన్సర్ ఇవో X, సుజుకి నెక్సా కార్లు ఉన్నాయి. ఈ వివరాలు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. పల్లవి సామాజిక నిబద్ధత కలిగిన వ్యక్తి కూడా. ఫెయిర్‌నెస్ క్రీములకు సంబంధించి వచ్చిన అనేక అడ్వర్టయిజ్‌మెంట్లను ఆమె తిరస్కరించడం కూడా ఆమె అభిమానుల సంఖ్య పెరగడానికి ఓ కారణం. వీటి వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి ఎంత పెద్ద రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా ఆమె తిరస్కరించేసింది.
ఇప్పుడు 'గార్గి' మూవీలో రేపిస్ట్‌గా ముద్రవేసి, పోలీసులు అరెస్ట్ చేసిన తండ్రి అమాయకుడని నిరూపించడానికి తీవ్రంగా ప్రయత్నించే ఓ స్కూల్ టీచర్‌గా సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె చెప్పే డైలాగ్స్, ఆమె హావభావాలు, కోర్టు రూమ్ సీన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



