అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. కారణమదేనా?
on Aug 21, 2022

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరి భేటీకి కారణమేంటంటూ చర్చలు జరుగుతున్నాయి.
మునుగోడు సభ కోసం నేడు అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. సభ అనంతరం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న అమిత్ షా.. సమీపంలోని నోవోటెల్ లో తారక్ తో డిన్నర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ ని ప్రత్యేకంగా డిన్నర్ కి ఆహ్వానించి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన అమిత్ షా.. అందులో భీమ్ పాత్రధారి తారక్ నటనకు ఫిదా అయ్యి ఆయన ప్రశంసించడానికి డిన్నర్ కి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం ప్రశంసించడానికే పిలిచారా? లేక ఈ భేటీ వెనక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనేది ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ప్రశ్న!.
ఇదిలా ఉంటే ఓ వైపు 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉందంటూ హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తుంటే.. మరోవైపు ఆయన నటనకు ఏకంగా కేంద్ర హోంమంత్రి ఫిదా అయ్యి ప్రత్యేకంగా భేటీ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



