Home

»

Latest News

పవన్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్.. 'హరి హర వీరమల్లు' రిలీజ్ డేట్ వచ్చేసింది!

Aug 21, 2022 4:13PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర షూటింగ్, విడుదలపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు.

 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రాజకీయాల కారణంగా పవన్ ఈ సినిమాకి సమయం కేటాయించలేకపోతున్నారని, ఈ సినిమా అసలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఎ.ఎం.రత్నం మీడియాతో మాట్లాడుతూ ఇది పీరియాడికల్‌ ఫిల్మ్ కావడం వల్లే ఆలస్యమవుతుందని, వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అని, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు.

 

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com