అజ్ఞాతం వీడిన జూనియర్ ఎన్టీఆర్!
on Dec 27, 2022

అజ్ఞాతంలో జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి యూఎస్ ట్రిప్ వెళ్లిన ఆయన.. అక్కడ ఎవరినీ కలవకపోవడం, ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా ఏవీ బయటకు రాకపోవడంతో 'ఎన్టీఆర్ ఎక్కడ?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిచ్చాయి. అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్ తన ట్రిప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ కి సంతోషం కలిగించాడు.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. దీనికి తోడు ఆయన ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్ళాడు. ఎలాగూ సినిమా అప్డేట్స్ లేవు.. కనీసం లేటెస్ట్ ఫోటోలైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే సంతోషిస్తామనే భావనలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ యూఎస్ వెళ్లి చాలా రోజులైనా ఫోటోలేవీ బయటకు రాలేదు. దీంతో అజ్ఞాతంలో ఎన్టీఆర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో ఒకటి రెస్టారెంట్ లో దిగింది కాగా, మరొకటి యూఎస్ వీధుల్లో ఆయన సతీమణి లక్ష్మి ప్రణతితో దిగిన ఫోటో. ఆ ఫోటోలో ఎన్టీఆర్-ప్రణతి జంట చూడ ముచ్చటగా ఉంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్- కొరటాల మూవీ సంక్రాంతికి లాంచ్ అయ్యి.. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



